Friday, 24 July 2026
  • Home  
  • కోగిలి వాటర్ ట్యాంక్ శిధిలా వ్యవస్థ .. పొంచి ఉన్న ప్రమాదం, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి,
- గూడూరు

కోగిలి వాటర్ ట్యాంక్ శిధిలా వ్యవస్థ .. పొంచి ఉన్న ప్రమాదం, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి,

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జూలై 23 చిట్టమూరు మండలం, మండల పరిధిలో ఉన్న కోకిల గ్రామం లోని రక్షిత మంచినీటి వాటర్ ట్యాంక్ శిధిలావస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు గోడలకు పలుచోట్ల చీల్లు ఏర్పడి, కొన్ని భాగాల్లో కాంక్రీట్ ఊడిపోవడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి తాగునీటి అందిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్యాంక్ బలహీనంగా మారడంతో అది కూలిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే ప్రాణం నష్టం తో పాటు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం తో పాటు గ్రామంలో తాగునీటి సరఫరా కూడా పూర్తిగా దెబ్బతింటుందని, వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న స్కూల్ పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల సంబంధిత పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు వెంటనే ట్యాంకును సాంకేతికంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు లేదా కొత్త ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకునే ప్రజల ప్రాణాలను, స్కూల్ పిల్లలను ప్రమాదం నుంచి కాపాడాలని కోవెల గ్రామస్తులు విజ్ఞప్తి. (పున్నమి న్యూస్) వార్తకి స్పందించిన, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రావు, మరియు ఎస్సీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ వెంటనే సురక్షిత మంచినీటి ట్యాంక్ కు సంబంధించిన మరమ్మతులు చేయిస్తామని కోగిలి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జూలై 23 చిట్టమూరు మండలం,

మండల పరిధిలో ఉన్న కోకిల గ్రామం లోని రక్షిత మంచినీటి వాటర్ ట్యాంక్ శిధిలావస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకు గోడలకు పలుచోట్ల చీల్లు ఏర్పడి, కొన్ని భాగాల్లో కాంక్రీట్ ఊడిపోవడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామానికి తాగునీటి అందిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ట్యాంక్ బలహీనంగా మారడంతో అది కూలిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే ప్రాణం నష్టం తో పాటు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం తో పాటు గ్రామంలో తాగునీటి సరఫరా కూడా పూర్తిగా దెబ్బతింటుందని, వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న స్కూల్ పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందువల్ల సంబంధిత పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు వెంటనే ట్యాంకును సాంకేతికంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు లేదా కొత్త ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి చేశారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకునే ప్రజల ప్రాణాలను, స్కూల్ పిల్లలను ప్రమాదం నుంచి కాపాడాలని కోవెల గ్రామస్తులు విజ్ఞప్తి.

(పున్నమి న్యూస్) వార్తకి స్పందించిన, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రావు, మరియు ఎస్సీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ వెంటనే సురక్షిత మంచినీటి ట్యాంక్ కు సంబంధించిన మరమ్మతులు చేయిస్తామని కోగిలి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.