తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలను పూర్తిగా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. కులశేఖరపట్నంలో ఉన్న అంతరిక్ష తయారీ కేంద్రాన్ని జాతీయ స్థాయి స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కోయంబత్తూరులో రెండో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పించే ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించాలని ప్రతిపాదించారు. అలాగే మత్స్యకారుల భద్రత, వరద నియంత్రణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.

కేంద్రంతో నిర్మాణాత్మక సహకారానికి తమిళనాడు సిద్ధం: సీఎం విజయ్