కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో శుక్రవారం నందలూరు మండలం చాపలవారిపల్లి గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మండల కో-క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, తమకు అపూర్వ స్వాగతం పలికిన చాపలవారిపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించడానికి తాము గ్రామాల్లోకి వస్తుంటే, ప్రజలే స్వయంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ, శ్రీశక్తితో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పలు పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించామని తెలిపారు.
“మాటలు చెప్పే ప్రభుత్వం కాదు… ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పనులతోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇదే విశ్వాసంతో ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేర్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుంది” అని రేవూరి వేణుగోపాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు గువ్వల జయరామయ్య ,బూత్ కన్వీనర్ కోటయ్య స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



