వార్త ముఖ్యాంశాలు
- కొత్త సుంకరపాలెం, కంటకాపల్లి గ్రామంల లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థిని నాగిశెట్టి గంగమ్మ గారు ఇంటింటి ప్రచారం 600 మంది కార్యకర్తలతో ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 02.పున్నమి ప్రతినిధి కంటకాపల్లి: గ్రామపంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి…
- సుమారు 600 మంది కూటమి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు.
- ఈ సందర్భంగా నాగిశెట్టి గంగమ్మ గారు మాట్లాడుతూ, కూటమి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, జడ్పిటిసి అభ్యర్థి గోరపల్లి జయప్రకాష్( శివ) గారుని,మమ్మల్నిద్దర్నీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కొత్త సుంకరపాలెం, కంటకాపల్లి గ్రామంల లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థిని నాగిశెట్టి గంగమ్మ గారు ఇంటింటి ప్రచారం
600 మంది కార్యకర్తలతో ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 02.పున్నమి ప్రతినిధి
కంటకాపల్లి: గ్రామపంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి గంగమ్మ గారు కొత్త సుంకర పాలెం,చినగొప్పు,కంటకాపల్లి గ్రామంల లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు 600 మంది కూటమి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా నాగిశెట్టి గంగమ్మ గారు మాట్లాడుతూ, కూటమి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, జడ్పిటిసి అభ్యర్థి గోరపల్లి జయప్రకాష్( శివ) గారుని,మమ్మల్నిద్దర్నీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి రమణ మాట్లాడుతూ కంటకాపల్లి ఓట్ల ప్రజానీకమంతా నా తల్లి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అలాగే జడ్పిటిసి అభ్యర్థి గోరపల్లి శివ ను కూడా అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాలని కోరి ఉన్నారు
ఈ యొక్క కార్యక్రమంలో కంటకాపల్లి మాజీ ఎంపీటీసీ మిడతన కాశి, తూరుబిల్లి ఆనంద్, మాజీ సర్పంచ్ సారిక రమణ, జనసేన నాయకులు తూరబిల్లి విజయ్, మదిన గురునాయుడు, మదిన రమణ, ములపర్తి దేముడు, తూరిబిల్లి రాము, తూరుబిల్లి లక్ష్మణ బాద్రిరెడ్డి వెంకటరమణ, బోధల వెంకట్, కొత్త సుంకరపాలెం గ్రామ టీడీపీ పెద్ద పెదిరెడ్ల సూర్యనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.