Sunday, 16 August 2026
  • Home  
  • కిచెన్ గార్డెన్లు పెంపకం ద్వారా ఆరోగ్యంతో పాటు అదనపు ఆదాయం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కిచెన్ గార్డెన్లు పెంపకం ద్వారా ఆరోగ్యంతో పాటు అదనపు ఆదాయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పరిధిలోని మహిళలకు కిచెన్ గార్డెన్లు పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ కిచెన్ గార్డెన్ లు పెంపకం ద్వారా ఆరోగ్యంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చునని అన్నారు. మహిళలు తమ ఇండ్లలో గల కాళీ స్థలాల్లో కిచెన్ గార్డెన్లు పెంపకం చేపట్టాలని ఆమె కోరారు. కిచెన్ గార్డెన్లు పెంపకం ద్వారా తాజా ఆకుకూరలు మరియు కూరగాయలు పొందడంతో పాటు,వినియోగానికి మించి ఉన్న ఆకుకూరలు కూరగాయలు అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని మహిళలు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.