కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అరుణ్‌కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కుటుంబానికి పంపించారు. బ్రహ్మసముద్రం మండలం ఎరాడికెర గ్రామానికి వెళ్లిన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరుణ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి బాల్యం రాజేష్‌తో పాటు పలువురు నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన