కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


