వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ గతంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేశారని బిఆర్ఎస్ అధికారంలో…
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ గతంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేశారని బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల ఎకరాల ప్రభుత్వ భూములను చరబట్టి బి ఆర్ఎస్ నాయకులు ఖాతాల్లోకి చేరి వెళ్లిపోయాయని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బంధుప్రీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని 6 గ్యారంటీలు అటుకెక్కించారని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మహిళలకు 2500 తులం బంగారం విద్యార్థినిలకు స్కూటీలు జాబ్ క్యాలెండర్ వృద్ధాప్య పింఛన్లు పెంపు ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలు చేసి మూడు సంవత్సరాలగా కాలం వెళ్ళదిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య బిజెపి ఎండోమెంట్ సెల్ జిల్లాజాయింట్ కన్వీనర్ బాష్పాక సుధాకర్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బసవ రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు బసవ మహేష్ తదితరులు పాల్గొన్నారు