తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, పార్టీ నాయకుల నివాసాలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం టూ టౌన్ మండల అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో జెండాల సెంటర్ వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆఫీస్ సెక్రటరీ నక్కల రవి గౌడ్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ బోయినపల్లి సురేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేందర్ సింగ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బొల్లా రాంబాబు, సీనియర్ నాయకుడు దాసరి మధుసూదన్, ఉపాధ్యక్షుడు పాశం శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు రుద్రగాని మాధవరావు, కన్నెకంటి కృష్ణచారి, భూపతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గుండాగిరిని ప్రజలు తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.



