Wednesday, 23 September 2026
  • Home  
  • కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి
- మేడ్చల్ – మల్కాజిగిరి

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

పున్నమి ప్రతినిధి: కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుతో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో కార్యాచరణకు శ్రీకారం బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నేతృత్వంలో ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టనున్న *కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై సమరభేరి* కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో పార్టీ శ్రేణులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, *ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు* మేడ్చల్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు,ముఖ్యనాయలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి *మాజీ మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు,కేపీ వివేకానంద గౌడ్, మార్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి* లతో పాటుగా ముఖ్యనాయకులు హాజరయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో నాయకులు విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అభివృద్ధి పనుల్లో జాప్యం, సంక్షేమ పథకాల అమలులో నెలకొన్న ఇబ్బందులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా సమరభేరి మోగించాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి.. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది.. ముఖ్యంగా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 22ఏ సమస్య,అభివృద్ధి పనులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సంక్షేమ పథకాలు తదితర స్థానిక సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా నాయకులు నిర్ణయించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం దక్కింది? ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎన్ని కొనసాగిస్తున్నారు? అనే అంశాలను ప్రజల ముందుంచి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమరభేరికి సిద్ధం కావాలని జిల్లా సమావేశంలో నాయకులు నిర్ణయించారు.. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ,మాజీ మంత్రి హరీష్ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది…

పున్నమి ప్రతినిధి:

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుతో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో కార్యాచరణకు శ్రీకారం

బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నేతృత్వంలో ఎమ్మెల్యేల సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టనున్న *కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై సమరభేరి* కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో పార్టీ శ్రేణులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు..

ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, *ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు* మేడ్చల్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు,ముఖ్యనాయలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి *మాజీ మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు,కేపీ వివేకానంద గౌడ్, మార్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి* లతో పాటుగా ముఖ్యనాయకులు హాజరయ్యారు.

జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో నాయకులు విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అభివృద్ధి పనుల్లో జాప్యం, సంక్షేమ పథకాల అమలులో నెలకొన్న ఇబ్బందులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా సమరభేరి మోగించాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయించారు.

ప్రభుత్వ వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి.. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది..

ముఖ్యంగా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 22ఏ సమస్య,అభివృద్ధి పనులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సంక్షేమ పథకాలు తదితర స్థానిక సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా నాయకులు నిర్ణయించారు.

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం దక్కింది? ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎన్ని కొనసాగిస్తున్నారు? అనే అంశాలను ప్రజల ముందుంచి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమరభేరికి సిద్ధం కావాలని జిల్లా సమావేశంలో నాయకులు నిర్ణయించారు..

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ,మాజీ మంత్రి హరీష్ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.