Thursday, 1 October 2026
  • Home  
  • ఒంగోలు చరిత్రకు ఘన నివాళి.. 150 ఏళ్ల వేడుకలు అద్భుతం: సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఒంగోలు చరిత్రకు ఘన నివాళి.. 150 ఏళ్ల వేడుకలు అద్భుతం: సోమిరెడ్డి

సర్వేపల్లి: ఒంగోలు పురపాలక సంస్థ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మంత్రులు గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. 150 ఏళ్ల చరిత్రను స్మరించుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఒంగోలు నగరంతో తనకు, తన కుటుంబానికి ఎంతోకాలంగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. నగరం మరింత అభివృద్ధి సాధించి, ప్రజలకు మెరుగైన వసతులు అందాలని ఆకాంక్షించారు. నగర చరిత్ర, వారసత్వాన్ని భావితరాలకు అందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.