నెల్లూరు:
నెల్లూరు జిల్లా ఏ, ఎస్, పేట, లో ప్రముఖ శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ అమ్మజాన్ దొరసానమ్మ హాబీబున్నిసా
దర్గాలో ఏడాదికి ఒకసారి మహిళా భక్తులకు దర్గా సమాధుల వద్దకు ప్రవేశం సొందల్ మాలి. అనగా అమ్మగారి సమాధికి గంధం సమర్పించు అనే కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి నుండి ఘనంగా ప్రారంభమైంది. గంధ మహోత్స ముందస్తు ప్రతి ఏటా నిర్వహించే
సొందల్ మాలి. కార్యక్రమానికి స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుండి. మహిళా భక్తులు పోటెత్తారు, అమ్మగారి సమాధుల వద్దకు వెళ్లే ప్రారంభంలో ముఖ ద్వారం వద్ద ముందుగా నువ్వు నేను అన్నట్టుగా మహిళలు క్యూ కట్టారు. అనంతరం ఆత్మకూరు సిఐ గంగాధర్ పరిరక్షణలో స్థానిక ఎస్సై జీలాని తోపాటు పలు మండలాల ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే, దర్గా వద్ద పోలీస్ వారితో పాటు దర్గా పరివేక్షణలో దర్గా ఏవో మహమ్మద్ హుసేని. ఆయన సిబ్బంది పాల్గొన్నారు.


