Monday, 7 September 2026
  • Home  
  • ఎల్వి మోహన్ రెడ్డి కృషితో నూతన ఆలయంలో ఘనంగా స్వామి వారి కళ్యాణం
- అన్నమయ్య

ఎల్వి మోహన్ రెడ్డి కృషితో నూతన ఆలయంలో ఘనంగా స్వామి వారి కళ్యాణం

– దేవమోచుపల్లెలోవైభవంగా నిర్వహించిన కళ్యాణ వేడుకలు దేవ మాచపల్లిలో ఘనంగా కల్యాణ మహోత్సవం – ఆలయ నిర్మాణానికి ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి కృషి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం దేవమాచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొగ్గలపాడు, రామాపురం హరిజనవాడలో ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కల్యాణ మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు, తాళిబొట్టును మంగళ వాయిద్యాల నడుమ భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు, కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి ఆలయాన్ని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దొగ్గలపాడు, రామాపురం, దేవమాచుపల్లి గ్రామాలకు చెందిన భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

– దేవమోచుపల్లెలోవైభవంగా నిర్వహించిన కళ్యాణ వేడుకలు
దేవ మాచపల్లిలో ఘనంగా కల్యాణ మహోత్సవం – ఆలయ నిర్మాణానికి ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి కృషి

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం దేవమాచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొగ్గలపాడు, రామాపురం హరిజనవాడలో ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కల్యాణ మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు, తాళిబొట్టును మంగళ వాయిద్యాల నడుమ భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు, కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి ఆలయాన్ని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దొగ్గలపాడు, రామాపురం, దేవమాచుపల్లి గ్రామాలకు చెందిన భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.