అల్లీపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, పలువురు ఇన్‌చార్జులు, చైర్మన్లు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ వ్యూహాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ప్రచారం, త్వరలో చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై చర్చించారు. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతమ్మ ఆత్మీయ సత్కారం అందించారు.



