బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో బిక్కవోలు ఎన్డీఏ నాయకులు బండిరేవు సమీపంలోని ప్రధాన డ్రైన్లో గుర్రపుడెక్క, తూడు, గడ్డి తదితర చెత్తను యంత్రాల సహాయంతో తొలగించే పనులు చేపట్టారు.
బిక్కవోలు డ్రైన్లోని కాజ్వే వద్ద అడ్డంగా పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూడు, గడ్డి కారణంగా వర్షపు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుండటంతో స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు ఈ పనులు ప్రారంభించారు. యంత్రాలతో డ్రైన్‌ను శుభ్రం చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు.
ఈ పనులను డ్రైనేజీ శాఖ డీఈ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పల్లి శ్రీనివాస రెడ్డి (వాసు), పి.వి.ఎస్.పి.చౌదరి (చిట్టిబాబు) పాల్గొని పనుల పురోగతిని పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తామని వారు తెలిపారు.




