Wednesday, 30 September 2026
  • Home  
  • ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఆపాలి. ఎస్ఐఆర్‌పై తప్పుడు ఆరోపణలు సరికాదు.. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరగాలి: నెల్లూరి కోటేశ్వరరావు
- ఖమ్మం

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఆపాలి. ఎస్ఐఆర్‌పై తప్పుడు ఆరోపణలు సరికాదు.. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరగాలి: నెల్లూరి కోటేశ్వరరావు

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం ఆపాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతిసారీ కాంగ్రెస్‌ రాజ్యాంగ సంస్థలను నిందించడం సరికాదన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్‌)ను ఓట్ల దొంగతనంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయడం, మరణించిన వారి పేర్లు, పునరావృత నమోదులను తొలగించడం ఎన్నికల ప్రక్రియలో భాగమన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూడాలని, అనర్హమైన నమోదులను పరిశీలించాలని సూచించారు. సెప్టెంబర్‌ 26న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి సమావేశంలో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఈసీ వెల్లడించిందన్నారు. ఆరోపణలు ఉంటే ఆధారాలతో సంబంధిత అధికారులను ఆశ్రయించాలని కోరారు. నోటీసులు అందుకున్నవారికి ఇబ్బందులు లేకుండా బీఎల్వోలు సహకరించాలని, వృద్ధులు, పేదలకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో భూక్య శ్యాంసుందర్ నాయక్, మేకల నాగేందర్, మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్, రవిరాథోడ్, రవి గౌడ్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం ఆపాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతిసారీ కాంగ్రెస్‌ రాజ్యాంగ సంస్థలను నిందించడం సరికాదన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్‌)ను ఓట్ల దొంగతనంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయడం, మరణించిన వారి పేర్లు, పునరావృత నమోదులను తొలగించడం ఎన్నికల ప్రక్రియలో భాగమన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూడాలని, అనర్హమైన నమోదులను పరిశీలించాలని సూచించారు.

సెప్టెంబర్‌ 26న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి సమావేశంలో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఈసీ వెల్లడించిందన్నారు. ఆరోపణలు ఉంటే ఆధారాలతో సంబంధిత అధికారులను ఆశ్రయించాలని కోరారు.

నోటీసులు అందుకున్నవారికి ఇబ్బందులు లేకుండా బీఎల్వోలు సహకరించాలని, వృద్ధులు, పేదలకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో భూక్య శ్యాంసుందర్ నాయక్, మేకల నాగేందర్, మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్, రవిరాథోడ్, రవి గౌడ్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.