Monday, 28 September 2026
  • Home  
  • ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

​ *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* *మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్* 18వ తేదీ సాయంత్రం కెనాల్ వద్ద ఒక మహిళ ముండెం లభించిందనే సమాచారంతో పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ​మరుసటి రోజు సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, NDRF బృందాల సహాయంతో కాలువలో తనిఖీ చేయగా తల, శరీరం లభించాయి. ​ సోషల్ మీడియా ప్రచారం మరియు ట్యాటూ మార్కుల ఆధారంగా మృతురాలిని ఏలూరు జిల్లా, జల్లిపల్లి మండలానికి చెందిన ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్న కర్రి కళ్యాణిగా గుర్తించారు. ​ గన్నవరంలో చదువుకున్న ఈమె, ఆ తర్వాత మంగళగిరికి వచ్చి హోటళ్లలో పనిచేస్తూ ఒక వ్యక్తితో సహజీవనం చేసింది. ​ విభేదాల వల్ల సహజీవనం చేసిన వ్యక్తి బంధువైన (ప్రస్తుత నిందితుడు) వ్యక్తికి కుమారుడు లేకపోవడంతో ఆ బాబును అతనికి అప్పగించారు. పిల్లాడిని పెంచుతున్న నిందితుడిని సదరు మహిళ వరుసగా డబ్బులు అడగడం, ఇవ్వకపోతే బాబును తీసుకెళ్లిపోతానని బెదిరించడంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. ​నేరం జరిగింది ఇలా 17వ తేదీన తన భార్యాపిల్లలను గుంటూరు పంపి, ఆ మహిళను ఇంటికి పిలిచి నరికి హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ముక్కలుగా నరికి కాలువలో పడేసాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని సీఐ, పోలీసు సిబ్బంది నిందితుడిని అరెస్ట్ చేశారు.

​ *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

*మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్*

18వ తేదీ సాయంత్రం కెనాల్ వద్ద ఒక మహిళ ముండెం లభించిందనే సమాచారంతో పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

​మరుసటి రోజు సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, NDRF బృందాల సహాయంతో కాలువలో తనిఖీ చేయగా తల, శరీరం లభించాయి.

​ సోషల్ మీడియా ప్రచారం మరియు ట్యాటూ మార్కుల ఆధారంగా మృతురాలిని ఏలూరు జిల్లా, జల్లిపల్లి మండలానికి చెందిన ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్న కర్రి కళ్యాణిగా గుర్తించారు.

​ గన్నవరంలో చదువుకున్న ఈమె, ఆ తర్వాత మంగళగిరికి వచ్చి హోటళ్లలో పనిచేస్తూ ఒక వ్యక్తితో సహజీవనం చేసింది.

​ విభేదాల వల్ల సహజీవనం చేసిన వ్యక్తి బంధువైన (ప్రస్తుత నిందితుడు) వ్యక్తికి కుమారుడు లేకపోవడంతో ఆ బాబును అతనికి అప్పగించారు.

పిల్లాడిని పెంచుతున్న నిందితుడిని సదరు మహిళ వరుసగా డబ్బులు అడగడం, ఇవ్వకపోతే బాబును తీసుకెళ్లిపోతానని బెదిరించడంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు.

​నేరం జరిగింది ఇలా 17వ తేదీన తన భార్యాపిల్లలను గుంటూరు పంపి, ఆ మహిళను ఇంటికి పిలిచి నరికి హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ముక్కలుగా నరికి కాలువలో పడేసాడు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని సీఐ, పోలీసు సిబ్బంది నిందితుడిని అరెస్ట్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.