Thursday, 16 April 2026
  • Home  
  • ఎంజీఎం స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు
- తిరుపతి

ఎంజీఎం స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. కిండర్ గార్డెన్ నుండి లోయర్ స్కూల్‌కు, లోయర్ స్కూల్ నుండి హయ్యర్ స్కూల్‌కు ప్రమోషన్ పొందిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలు ధరించి విద్యా ప్రయాణంలో తొలి మైలురాయిని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చేస్తూ వేడుకలను కోలాహలంగా మార్చారు. గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలతో చిన్నారులు కొత్త దశలోకి అడుగుపెడుతున్న సందేశాన్ని ప్రతిబింబించారు. కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ..విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ వేడుకలో స్కూల్ హెడ్మాస్టర్ ముని రత్నం నాయుడు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.