Wednesday, 13 May 2026
  • Home  
  • ఊరందూరులో శశిధర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నివాళి
- తిరుపతి

ఊరందూరులో శశిధర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నివాళి

శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు శశిధర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఊరందూరు గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న ఆయన, శశిధర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే శశిధర్ రెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సుమన్, దిలీప్, నవీన్, సాయి, శివ, నాగరాజు, రంగయ్య, సంజీవయ్య, నేతాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.