Tuesday, 26 May 2026
  • Home  
  • ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*
- విశాఖపట్నం

ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

*ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ* *ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చ* *విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్:* ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.

*ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

*ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చ*

*విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్:* ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.