Tuesday, 8 September 2026
  • Home  
  • ఆర్.సి పురంలో 93% సర్ ప్రక్రియ పూర్తి
- తిరుపతి

ఆర్.సి పురంలో 93% సర్ ప్రక్రియ పూర్తి

రామచంద్రాపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 విచారణ ప్రక్రియ 93% పూర్తయిందని మండల సహాయ ఎన్నికల అధికారి యు మధుసూదన్ రావు తెలిపారు. మంగళవారం ఏఈఆర్ఓ పులిరాం సింగ్ సికె పల్లి, అనుపల్లి పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓ ల ద్వారా నోటీసులు అందుకున్న ఓటర్లు ఒరిజినల్ ధృవపత్రాలతో విచారణకు హాజరైనట్లు తెలిపారు. మండలంలోని 33 పోలింగ్ కేంద్రాలలో 4225 మంది ఓటర్లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశామన్నారు. 3929 ఓటర్లకు విచారణ పూర్తి చేసామని మిగిలిన 7 శాతం 295 ఓటర్ల విచారణ చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో విచారణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కాని ఓటర్లు తప్పకుండా రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో సూపర్వైజర్ తరుణ్, బిఎల్వోలు సాహిజా, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రాపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి

మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 విచారణ ప్రక్రియ 93% పూర్తయిందని మండల సహాయ ఎన్నికల అధికారి యు మధుసూదన్ రావు తెలిపారు. మంగళవారం ఏఈఆర్ఓ పులిరాం సింగ్ సికె పల్లి, అనుపల్లి పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓ ల ద్వారా నోటీసులు అందుకున్న ఓటర్లు ఒరిజినల్ ధృవపత్రాలతో విచారణకు హాజరైనట్లు తెలిపారు. మండలంలోని 33 పోలింగ్ కేంద్రాలలో 4225 మంది ఓటర్లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశామన్నారు. 3929 ఓటర్లకు విచారణ పూర్తి చేసామని మిగిలిన 7 శాతం 295 ఓటర్ల విచారణ చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో విచారణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కాని ఓటర్లు తప్పకుండా రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో సూపర్వైజర్ తరుణ్, బిఎల్వోలు సాహిజా, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.