ఆరోగ్యవంతమైన యువతే వికసిత్ భారత్ కు బలమైన పునాది.
* బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్.
కుప్పం, అక్టోబర్01 (పున్నమి ప్రతినిధి):కుప్పం ఇంజినీరింగ్ కళాశాల మరియు కుప్పం డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ – మై హెల్త్, మై ప్రైడ్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బి సి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి, నాగరాజ్ ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన పునాది” అని, యువత తమ విలువైన సమయాన్ని, అపారమైన శక్తిని విద్య, క్రీడలు, సామాజిక సేవ, పరిశోధన, సృజనాత్మకత మరియు దేశ నిర్మాణ కార్యక్రమాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకర అలవాట్లని, వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం పెంపొందించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మై హెల్త్ – మై ప్రైడ్ థీమ్‌లో భాగంగా విద్యార్థులకు సుమారు 3-5 కిలోమీటర్ల అవగాహన నడక చేపట్టారు, కుప్పం పట్టణంలోని చారిత్రక ప్రాంతాలు, స్థానిక వారసత్వ ప్రదేశాలను మార్గంలో భాగంగా చేసుకుని నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. యువత తమ సమయాన్ని శక్తిని విద్య, క్రీడలు, సామాజిక సేవ మరియు సృజనాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు “నా ఆరోగ్యం నా గర్వకారణం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాం వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుతాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమములో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్, సాగర్ రాజ్ ప్రిన్సిపాల్ డా S. సుధాకర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్, భాస్కరన్, హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి మాధవన్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, డా. అరుణ్ కుమార్, వివిధ విభాగాధిపతులు, పీఆర్వో ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, వాలింటర్స్ పాల్గొన్నారు.

ఆరోగ్యవంతమైన యువతే వికసిత్ భారత్ కు బలమైన పునాది.
ఆరోగ్యవంతమైన యువతే వికసిత్ భారత్ కు బలమైన పునాది. * బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్. కుప్పం, అక్టోబర్01 (పున్నమి ప్రతినిధి):కుప్పం ఇంజినీరింగ్ కళాశాల మరియు కుప్పం డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ – మై హెల్త్, మై ప్రైడ్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బి సి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి, నాగరాజ్ ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన పునాది” అని, యువత తమ విలువైన సమయాన్ని, అపారమైన శక్తిని విద్య, క్రీడలు, సామాజిక సేవ, పరిశోధన, సృజనాత్మకత మరియు దేశ నిర్మాణ కార్యక్రమాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకర అలవాట్లని, వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం పెంపొందించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మై హెల్త్ – మై ప్రైడ్ థీమ్‌లో భాగంగా విద్యార్థులకు సుమారు 3-5 కిలోమీటర్ల అవగాహన నడక చేపట్టారు, కుప్పం పట్టణంలోని చారిత్రక ప్రాంతాలు, స్థానిక వారసత్వ ప్రదేశాలను మార్గంలో భాగంగా చేసుకుని నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. యువత తమ సమయాన్ని శక్తిని విద్య, క్రీడలు, సామాజిక సేవ మరియు సృజనాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు “నా ఆరోగ్యం నా గర్వకారణం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాం వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుతాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమములో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్, సాగర్ రాజ్ ప్రిన్సిపాల్ డా S. సుధాకర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్, భాస్కరన్, హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి మాధవన్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, డా. అరుణ్ కుమార్, వివిధ విభాగాధిపతులు, పీఆర్వో ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, వాలింటర్స్ పాల్గొన్నారు.

