ఆరోగ్యవంతమైన బాల్యం కోసం అంగన్‌వాడి బాటలో నడుద్దాం
.ప్రీ-స్కూల్ విద్యకు అంగన్‌వాడి కేంద్రాలను ఆశ్రయించండి
యాచారం, జూన్
.ప్రీ-స్కూల్ విద్యకు అంగన్‌వాడి కేంద్రాలను ఆశ్రయించండి అని గ్రామ సర్పంచ్ రాయికంటి విజయ్ కుమార్ అన్నారు.మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో “అమ్మ మాట – అంగన్‌వాడి బాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఐసీడీస్ ఇబ్రహీంపట్నం సీడీపీఓ వినితా దేవి ఆదేశాల మేరకు, సూపర్వైజర్ సరళ పర్యవేక్షణలో అంగన్వాడీ టీచర్స్ నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాయకంటి విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ…గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులు అంగన్‌వాడి కేంద్రాలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం మరియు ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్‌వాడి కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పోషకాహార కార్యక్రమాలు, తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో మంచి స్పందన పొందిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్స్ , పోలీస్ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



