ఆత్మకూరు: విధి నిర్వహణలో అంకితభావంతో, నిబద్ధతతో విశిష్ట సేవలు అందించిన ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రాములుకు ప్రతిష్టాత్మక ఉత్తమ సేవా అవార్డు లభించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఎంవీఐ రాములు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, నిబద్ధతతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది.
ప్రజల భద్రత, రవాణా నియమాల అమలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాములు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రాములుకు అధికారులు, సహచర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.


