Thursday, 16 July 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (APEEU-1104)
- ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (APEEU-1104)

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (APEEU-1104) ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఈ రోజు ఉదయం 11.00 గంటలకు APEEU-1104 యూనియన్ కళా ప్రాంగణం, కేశిరెడ్డి నగర్, కనిగిరి (డివిజన్ కార్యాలయం సమీపంలో) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి చేతుల మీదుగా 1104 యూనియన్ నోటీసు బోర్డు ఆవిష్కరణ జరిగింది. అనంతరం యూనియన్ సభ్యులు భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తదుపరి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఆర్. సంజీవరావు గారు మరియు సీపీడీసీఎల్ డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు చేతుల మీదుగా డివిజన్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ అన్నే శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా మీటింగ్ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, డిస్కం నాయకులు ఉద్యోగుల సమస్యలు, యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారంపై ప్రసంగించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికల్లో క్రింది నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు: శ్రీ తేళ్ల జాన్సన్ జిల్లా కార్యదర్శి: శ్రీ సి.హెచ్. హరికృష్ణ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు: శ్రీ సి.హెచ్. రవికాంత్, శ్రీ బి. అప్పారావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు: శ్రీ ఎ.వి. ప్రతాప్, శ్రీ బి. సురేష్ జిల్లా కోశాధికారి: శ్రీ యు. రవిశంకర్ నూతనంగా ఎన్నికైన నాయకులకు జిల్లా వ్యాప్తంగా యూనియన్ నాయకులు, సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీడీసీఎల్ డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు మాట్లాడుతూ, పెండింగ్ డీఏ (DA) విడుదలకు ప్రభుత్వం వద్ద ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే వేతన సవరణ (PRC)ను కూడా వీలైనంత త్వరగా అమలు చేయించేందుకు యూనియన్ రాష్ట్ర నాయకత్వం నిరంతరం కృషి చేస్తోందని సభ్యులకు హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (APEEU-1104)

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఈ రోజు ఉదయం 11.00 గంటలకు APEEU-1104 యూనియన్ కళా ప్రాంగణం, కేశిరెడ్డి నగర్, కనిగిరి (డివిజన్ కార్యాలయం సమీపంలో) ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కనిగిరి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి చేతుల మీదుగా 1104 యూనియన్ నోటీసు బోర్డు ఆవిష్కరణ జరిగింది. అనంతరం యూనియన్ సభ్యులు భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

తదుపరి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఆర్. సంజీవరావు గారు మరియు సీపీడీసీఎల్ డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు చేతుల మీదుగా డివిజన్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ అన్నే శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా మీటింగ్ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, డిస్కం నాయకులు ఉద్యోగుల సమస్యలు, యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారంపై ప్రసంగించారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికల్లో క్రింది నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లా అధ్యక్షులు: శ్రీ తేళ్ల జాన్సన్

జిల్లా కార్యదర్శి: శ్రీ సి.హెచ్. హరికృష్ణ

జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు: శ్రీ సి.హెచ్. రవికాంత్, శ్రీ బి. అప్పారావు

జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు: శ్రీ ఎ.వి. ప్రతాప్, శ్రీ బి. సురేష్

జిల్లా కోశాధికారి: శ్రీ యు. రవిశంకర్

నూతనంగా ఎన్నికైన నాయకులకు జిల్లా వ్యాప్తంగా యూనియన్ నాయకులు, సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీపీడీసీఎల్ డిస్కం కార్యదర్శి శ్రీ నందిగామ శర్మ గారు మాట్లాడుతూ, పెండింగ్ డీఏ (DA) విడుదలకు ప్రభుత్వం వద్ద ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే వేతన సవరణ (PRC)ను కూడా వీలైనంత త్వరగా అమలు చేయించేందుకు యూనియన్ రాష్ట్ర నాయకత్వం నిరంతరం కృషి చేస్తోందని సభ్యులకు హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.