Tuesday, 2 June 2026
  • Home  
  • అమరుల ఆశయ సాధనకై కృషి చేద్దాం
- యాదాద్రి భువనగిరి

అమరుల ఆశయ సాధనకై కృషి చేద్దాం

జూన్ 2, భువనగిరి..తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్, టీజేఏసీ కన్వీనర్ మెరుగు మధు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద స్తూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న అమరులను ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు అన్నారు. ఈ సందర్భంగా భువనగిరి కేంద్రంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరులు శ్రీకాంతాచారి, అముద చిత్తరంజన్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆకుల జయమ్మ, వేణుకొండలు, కళాకారుడు జహంగీర్ ల ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థూప నిర్మాణ కమిటీ చైర్మన్ మాటూరు అశోక్, వైస్ చైర్మన్ కొత్త బాలరాజు, ఉద్యోగ సంఘాల కో కన్వీనర్, ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, నల్ల కృష్ణ, జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు పోతంశెట్టి కరుణాకర్, టిఎల్ఎఫ్ నాయకులు కొడిమాల కృష్ణ, కొలుపుల రమేష్, బండారు రవివర్ధన్, శ్రీనివాస్, రాయగిరి శంకర్, ఆటో జాక్ లక్ష్మణ్, సహదేవ్, వినోద్, పోకల ఎట్టయ్య తదితరులు పాల్గొన్నారు

జూన్ 2, భువనగిరి..తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్, టీజేఏసీ కన్వీనర్ మెరుగు మధు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద స్తూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న అమరులను ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు అన్నారు.
ఈ సందర్భంగా భువనగిరి కేంద్రంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరులు శ్రీకాంతాచారి, అముద చిత్తరంజన్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆకుల జయమ్మ, వేణుకొండలు, కళాకారుడు జహంగీర్ ల ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థూప నిర్మాణ కమిటీ చైర్మన్ మాటూరు అశోక్, వైస్ చైర్మన్ కొత్త బాలరాజు, ఉద్యోగ సంఘాల కో కన్వీనర్, ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, నల్ల కృష్ణ, జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు పోతంశెట్టి కరుణాకర్, టిఎల్ఎఫ్ నాయకులు కొడిమాల కృష్ణ, కొలుపుల రమేష్, బండారు రవివర్ధన్, శ్రీనివాస్, రాయగిరి శంకర్, ఆటో జాక్ లక్ష్మణ్, సహదేవ్, వినోద్, పోకల ఎట్టయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.