కాకినాడ, ఆగష్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్‌రెడ్డి నియమితులైన సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, IAS గారిని, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, IAS గారిని నల్లమిల్లి మనోజ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా తదితరులు ఆయన వెంట ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని నాయకులు పేర్కొన్నారు.



