Wednesday, 22 July 2026
  • Home  
  • అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
- తూర్పు గోదావరి

అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

అనపర్తి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియామకం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నియామక ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి మనోజ్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా మనోజ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు నిరంతరం వచ్చి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి నాయకులు, కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.

అనపర్తి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):

అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియామకం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నియామక ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి మనోజ్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు.

అలాగే కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా మనోజ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు నిరంతరం వచ్చి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి నాయకులు, కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.