Monday, 17 August 2026
  • Home  
  • అడ్డ కొండ భూములు పేదలకు పట్టాలు ఇవ్వాలి
- తూర్పు గోదావరి

అడ్డ కొండ భూములు పేదలకు పట్టాలు ఇవ్వాలి

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 17 *పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి తగదు*. *అడ్డకొండ భూములు పేదలకు పంచే వరకు పోరాటం ఆగదు*. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మల్లిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు కాకినాడజిల్లా ,జగ్గంపేట మండలం, మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బిసి, ఇతర నిరుపేదలు సోమవారం నాడు జగ్గంపేట ప్రధాన రోడ్డులో నిరసన ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ మల్లిసాల అడ్డ కొండ భూములపై గత మూడు దశాబ్దాలుగా మల్లిసాల ,గోపాలపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, బీసీ,ఎస్టీ మరియు ఇతర నిరుపేదలు అనేకమంది పోరాడుతున్నారని, అనేక వేయ ప్రయాసలతో 30 ఏళ్ల క్రితం భూమి చదును చేసి మామిడి, జీడి మామిడి మొక్కలను నాటి, భూస్వాముల గుండాల దాడులను, పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొని పోరాడారన్నారు. అధికారుల సహకారంతో భూస్వాములు కోర్టుకు వెళ్లిన కోర్టు భూస్వాములకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షంలో ఉండగా పోరాటంలో ఉన్న ప్రజలందరికీ కష్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొని పోరాడుతున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా, ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని అనడం దారుణం అన్నారు. గత మామిడికాయ సీజన్లో రైతులు మామిడికాయ కోసుకుంటుంటే అధికారులు జోక్యం చేసుకుని ఆ భూములను సర్వే చేయించి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జ్యోతుల నెహ్రూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారి విచారణ చేపట్టి మూడు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాడుతున్న మల్లిసాల, గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ ఎస్టీ ఇతర పేదలకు ఆ భూములను పంచాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, ఏఐఎఫ్ టు యు జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు, పి.డి.ఎస్.యు(వి)రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా నాయకులు కే రామలింగేశ్వరరావు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు నాయకత్వం వహించారు.

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 17

*పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి తగదు*.
*అడ్డకొండ భూములు పేదలకు పంచే వరకు పోరాటం ఆగదు*.
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం.
గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మల్లిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు కాకినాడజిల్లా ,జగ్గంపేట మండలం, మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బిసి, ఇతర నిరుపేదలు సోమవారం నాడు జగ్గంపేట ప్రధాన రోడ్డులో నిరసన ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ మల్లిసాల అడ్డ కొండ భూములపై గత మూడు దశాబ్దాలుగా మల్లిసాల ,గోపాలపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, బీసీ,ఎస్టీ మరియు ఇతర నిరుపేదలు అనేకమంది పోరాడుతున్నారని, అనేక వేయ ప్రయాసలతో 30 ఏళ్ల క్రితం భూమి చదును చేసి మామిడి, జీడి మామిడి మొక్కలను నాటి, భూస్వాముల గుండాల దాడులను, పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొని పోరాడారన్నారు. అధికారుల సహకారంతో భూస్వాములు కోర్టుకు వెళ్లిన కోర్టు భూస్వాములకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షంలో ఉండగా పోరాటంలో ఉన్న ప్రజలందరికీ కష్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొని పోరాడుతున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా, ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని అనడం దారుణం అన్నారు. గత మామిడికాయ సీజన్లో రైతులు మామిడికాయ కోసుకుంటుంటే అధికారులు జోక్యం చేసుకుని ఆ భూములను సర్వే చేయించి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జ్యోతుల నెహ్రూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారి విచారణ చేపట్టి మూడు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాడుతున్న మల్లిసాల, గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ ఎస్టీ ఇతర పేదలకు ఆ భూములను పంచాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, ఏఐఎఫ్ టు యు జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు, పి.డి.ఎస్.యు(వి)రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా నాయకులు కే రామలింగేశ్వరరావు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు నాయకత్వం వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.