ముద్దనూరు: ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు రాజుల సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ భారతి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పాలు, బాలామృతం తదితరాలను సక్రమంగా పంపిణీ చేయడంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఉప్పులూరు గ్రామంలోని హనుమాన్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఆమె అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన పిల్లలకు సక్రమంగా అందించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసయ్య, అంగన్వాడీ పర్యవేక్షకురాలు లక్ష్మీప్రసన్న, రాజుల సుధాకర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం