వార్త ముఖ్యాంశాలు
- బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి కూసుమంచి: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో సోమవారం ‘అంగన్ మిలన్ – సేవా కార్యక్రమం’ నిర్వహించారు.
- స్థానిక వార్డు సభ్యులు, బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు, వర్కర్లను వారి సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.
- ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, ఇతర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి
కూసుమంచి: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో సోమవారం ‘అంగన్ మిలన్ – సేవా కార్యక్రమం’ నిర్వహించారు. స్థానిక వార్డు సభ్యులు, బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు, వర్కర్లను వారి సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, ఇతర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని గుండా ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులు పొన్నం ఉపేందర్ నాయుడు, స్థానిక వార్డు సభ్యులు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్, ఆడెపు శివ, బద్దం వెంకటరెడ్డి, దాసరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.