వరికుంటపాడు: స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కూటమి బలపరిచిన అభ్యర్థి, జనసేన నాయకుడు మాల్యాద్రి చైర్మన్‌గా, సుభాషిని వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, ఆవుల రమణయ్య, మానం నిఖిల్, సంచిపోయిన మాధవ, చంచల బొజ్జయ్య తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.


