Saturday, 19 September 2026

Tag: ఘట్కేసర్

రంగారెడ్డి

బుగ్గనగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. 1500 మందికి పైగా భక్తులకు అన్నదానం

ఘట్కేసర్: బుగ్గనగర్ కాలనీలో గణేష్ నవరాత్రి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 1988 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది కాలనీలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణేష్ విగ్రహాన్ని గతంలో ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసేవారమని తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏడవ రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు1500 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లడ్డు వేలం పాటకు కూడా మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లడ్డు వేలం పాటలో రూ.69 వేల ధర పలికిందని, ఈ ఏడాది అంతకంటే అధిక ధరకు లడ్డు వేలం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సంజయ్, అజయ్, విఘ్నేశ్వర్ యూత్ సభ్యులు, రాహుల్, శివ, భూపేందర్, అనిల్, టిల్లు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

అంబేద్కర్ జయంతి నాడు మద్యనిషేధ దినంగా ప్రకటించాలి… బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గగనం వెంకటస్వామి

పున్నమి: రంగారెడ్డి జిల్లా: ఘట్కేసర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గగనం వెంకటస్వామి ప్రభుత్వాన్ని కోరారు. మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున మద్యం విక్రయాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ జయంతి రోజున మద్యం దుకాణాలు, బార్‌లు తదితర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ జయంతిని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని గగనం వెంకటస్వామి కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.