జాతీయ అంతర్జాతీయ
ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు స్పష్టత
ఓటర్ల నమోదు ఫారం-6లో చేసిన మార్పులకు తమ గత తీర్పుతో సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మే 27 తీర్పు బిహార్ ఓటర్ల జాబితా సవరణ చట్టబద్ధతకు మాత్రమే సంబంధించినదని తెలిపింది. వంశపారంపర్య వివరాలు కోరే మార్పులు జూలైలో వచ్చాయని పేర్కొంది. వాటిని ఆమోదించలేదని, తిరస్కరించలేదని వివరించింది.
