Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Saddhulabathukamma

ASIFABAD

కైరిగూడ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను కైరిగూడ గ్రామంలో మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, బతుకమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కైరిగూడకు చెందిన బానోత్ సుబ్బారావు నాయక్, ఉపసర్పంచ్ కుంషోత్ సునీతా శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో డావ్ గణపతి, ఇచ్చారి రమేష్, గుడి పూజారి వసంత్, భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులు రవీందర్, వెంకటేష్, వినోద్, శ్రీకాంత్, గోపాల్, బానేష్, నవీన్, స్టార్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్, తరుణ్, సుధర్‌తో పాటు మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.