వెదురుపట్టు రాజుపాలెంలో చెత్త దారుణం.. రోడ్లే డంపింగ్ యార్డులుగా!
వెదురుపట్టు రాజుపాలెంలో, ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సిన సిబ్బంది, దాన్ని రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఊరి ప్రజలు దీన్ని ప్రశ్నిస్తే, సిబ్బంది డంపింగ్ యార్డ్ దూరం ఉందని, అంత దూరం తీసుకెళ్లడం సాధ్యం కాదని, దీనివల్ల ఏమీ కాదులే అని సాకులు చెబుతున్నారు. ఇలా చెత్తను పారబోయడం వల్ల దోమలు వ్యాప్తి చెంది, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చెత్తను తరలించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని ఊరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


