కరీంనగర్
17వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐ గోపి ఆనారోగ్యంతో మృతి
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది సిరిసిల్ల 17వ బెటాలియన్ లో ఎఆర్ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న జాటోత్ గోపి ఆనారోగ్యంతో బుధవారం చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం కొత్తూరు కురివి తండాకు చెందిన వారు 2013లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరి హెడ్ కానిస్టేబుల్ , తరువాత ఎఆర్ఎస్ఐ గా పదోన్నతి పొందారు. విఐపి, ఎన్నికల విధుల్లో విశేష సేవలందించారు. విధి నిర్వహణలో 14 రివార్డులు అందుకున్నారు.
