Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Distric news

పశ్చిమ గోదావరి

గురువారం భీమవరంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో 8 10 2026 గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భీమవరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఇఏ) జిల్లా కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమావేశం నిర్వహింపబడుతుంది. ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జిల్లా తాలూకా స్థాయి కార్యవర్గ సభ్యులంతా హాజరు కావలెనని,కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు చెందిన సంఘ నాయకులు కూడా హాజరవుతారు అని జిల్లాలోని అన్ని తాలూకా లా నుండి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు తరలిరావాలి అని కావున సంఘ నాయకులు జిల్లా అధ్యక్షులు యేళ్ళ మోహనరావు తెలియజేశారు.కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి విధిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పి. గిరి ప్రసాద్ వర్మ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఎం జగన్నాథం కాకినాడ జిల్లా అధ్యక్షులు, జె. గోవిందరావు ఏలూరు జిల్లా సహాధ్యక్షులు, కాండ్రేగుల మల్లేశ్వరరావు అమలాపురం అధ్యక్షులు హాజరవుతారు అని మోహన్ రావు తెలియజేశారు.