మారుతి అప్ప సేవలు అనిర్వచనీయం
మారుతి అప్ప సేవలు అనిర్వచనీయం బైంసా సెప్టెంబర్ 18 మనోరంజని తెలుగు టైమ్స్ మారుతి అప్ప సేవలు అనిర్వచనీయమని ప్రముఖ కవయిత్రి కందకుర్తి దేవి ప్రియ అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన మారుతి అప్పకు సన్మానించి, అభినందించారు. విద్యారంగంలో ఉపాధ్యాయులుగా సేవలు అందించి ఎందరో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాసర సరస్వతి క్షేత్ర పరిశోధకులు డాక్టర్ కోవెల శ్రీనివాస్ ఆచార్య, ప్రముఖ కవులు కడారీ దశరథ్, కొండూరి పోతన్న, నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమ రచయితల సంఘం నిర్మల్ జిల్లా కన్వీనర్ జాధవ్ పుండలిక్ రావు పాటిల్, శ్రీహంస వాహిని సాహిత్య కళా పీఠం సహకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

