Sunday, 16 August 2026

Tag: పోలీసు

నంద్యాల

నంద్యాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షొరాణ్ IPS జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రధాన వేడుకల్లో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా IAS, ఎస్పీ సునీల్ షొరాణ్ పాల్గొన్నారు. మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కవాతు, ప్రభుత్వ పథకాల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి మంత్రి, కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.