సముద్రాల గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల యాదగిరి, కార్యదర్శి సోమేష్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ గుండె లక్ష్మణ్, పంచాయతీ సిబ్బంది, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు.

