Thursday, 1 October 2026

Tag: జనగాం

జనగాం

చాగల్లు రైతుల కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చాగల్లు రైతులకు సాగునీరు అందించేందుకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణ చర్యలు చేపట్టారు. 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి పొలాలు ఎండిపోతున్న పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే అక్టోబర్ 2న కెనాల్ ద్వారా నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

జనగాం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

*రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు* ————————————————– జనగామ, ఆగష్టు 15,పున్నమి ప్రతినిధి : ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* QR కోడ్‌తో కార్డుకు పటిష్ట భద్రత జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారుల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని *ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* అన్నారు. శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణిలతో కలిసి ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *ప్రభుత్వ విప్* మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి 6 కిలోల బియ్యం పొందే సౌకర్యంతో పాటు, QR కోడ్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుకు భద్రత కల్పించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు సుమారు రూ. కోటి 87 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, తద్వారా సుమారు 3.43 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. పుట్టిన పిల్లల నమోదు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుతో సంక్షేమ సేవలు అందించుట, ప్రతి చివరి గడపకు పథకాల ఫలితాలను చేరవేయుట, ఆరు కిలోల బియ్యం సరఫరా, QR కోడ్ ద్వారా రేషన్ పరిమాణాన్ని పరిశీలించడం, ఆరోగ్య పథకాలు, విద్యా ఫీజు రాయితీలు, ఇతర ప్రయోజనాలకు కార్డు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ఒంటరి మహిళలు, డయాలిసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారు, అర్హులైన ఇతరులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడంలో జనగామ జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేస్తున్న *జిల్లా కలెక్టర్‌ను, విప్* అభినందించారు. అనంతరం *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు. ఆధార్ కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులో 11 ప్రత్యేక ఫీచర్లు ఉంటాయని, QR కోడ్ వంటి భద్రతా అంశాలతో కార్డును నకిలీ చేయడం అత్యంత కష్టతరమని అన్నారు. లబ్ధిదారులు కార్డులను అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. జిల్లాలో మంజూరైన 1,87,214 స్మార్ట్ రేషన్ కార్డులను మండల స్థాయి అధికారులు, శాసనసభ్యుల ద్వారా 15 రోజుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. *మీ సేవా కేంద్రం ప్రారంభం* అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీ – సేవా కేంద్రాన్ని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణిలతో కలిసి ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* ప్రారంభించారు. మీ – సేవా కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించి, వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపిరామ్, కిరణ్ ప్రకాష్, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.