Tuesday, 8 September 2026

Tag: కామారెడ్డి

కామారెడ్డి

ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? ​ఓటేశారు.. ఊరి దాహం తీర్చారు.. చివరికి బలైపోయారు!

​కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గూగుల్ తండాలో దారుణం: ఒకే వంశానికి చెందిన 5 కుటుంబాలపై కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ. 50 వేల జరిమానా! ​కామారెడ్డి, 24 ఆగష్టు, ( పున్నమి ప్రతినిధి ) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రసా దించిన ప్రాథమిక హక్కులు పల్లె గడప దాటి ఇంకా లోతట్టు తండాలకు చేరలేదా? ప్రజాస్వా మ్యంలో స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు సామాన్యుడికి లేదా? అనే చేదు నిజాలను కళ్లకు కడుతోంది. రా మారెడ్డి మండలం గూగుల్ (2) తండాలో వెలుగు చూసిన అమానవీయ ఘటన. తరతరాలుగా కలిసి బతికిన నేలపైనే కొందరు పెత్తందార్లు ఏకమై ఐదు నిరుపేద గిరిజన కుటుంబాలను సమాజం నుంచి వెలివేశారు. ఊరి దాహం తీర్చినందుకు, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును నచ్చిన రీతిలో వినియోగించుకున్నందుకు ఆ కుటుంబాలు అను భవిస్తున్న నరకయాతన జిల్లావ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. మంచి మనసుతో చేను ఇచ్చారు.. కక్షతో గొంతు నొక్కారు! గోకుల్ తండా లో కొన్నేళ్ల క్రితం తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. పశువులకు, పసిపిల్లలకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో బాధితులకు చెందిన సొంత సాగుభూమిలో గ్రామం తరఫున బోరు వేయించేందుకు వారు అంగీకరించారు. అయితే,ఆ బోరు చుట్టూ దారి వివాదాన్ని సృష్టించి న కొందరు స్వార్థపరులు, ఎన్నికల్లో జరిగిన రాజ కీయ వైరాన్ని దీనికి ముడిపెట్టారు.మా మాటకు ఎదురుచెప్పి ఓటేశారా?అన్న కక్షతో ఆ ఐదు కు టుంబాలను టార్గెట్ చేస్తూ గ్రామం మొత్తాన్ని రెచ్చగొట్టారు.సమస్యను సామరస్యంగా పరిష్క రించుకోవాల్సింది పోయి, పథకం ప్రకారం బాధితు లపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు.ఆ ఘర్ష ణల్లో ఇరువర్గాలకు తీవ్ర గాయాలు కావడం, విష యం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో పెత్తందార్ల అహం మరింత దెబ్బతింది.తుగ్లక్ ఫర్మానాలు.. మాట్లాడితే రూ. 50 వేల జరిమానా!​కేసు నమోదు కావడంతో తట్టుకోలేని కొందరు పెద్దమనుషులు తండా పంచాయితీ పేరుతో సమాంతర న్యాయా న్ని అమలు చేశారు.ఐదు కుటుంబాలను శాశ్వతం గా గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేస్తూ అమానుష ఆంక్షలు విధించారు.సాంఘిక బహిష్క రణ..వెలివేసిన కుటుంబాల సభ్యులతో తండాలో ఎవరైనా మాట్లాడినా, మంచిచెడుల్లో పాలుపంచు కున్నా రూ.50,000 జరిమానా చెల్లించాలని హు కుం జారీ చేశారు.ఉపాధిపై దెబ్బ..వారికి ఎలాంటి వ్యవసాయ లేదా కూలీ పనులు ఇవ్వకూడదని, వారి పొలాల్లో పనులకు ఎవరూ వెళ్లకూడదని ఆం క్షలు విధించి ఆర్థికంగా పస్తులుండేలా చేస్తున్నారు.అంటరానితనం: నిత్యం వారిని కించపరుస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తూ తండాలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు.ప్రాణహాని బెదిరింపులు,తమ పెత్తనాన్ని ఎదిరించి పోలీసు లను ఆశ్రయించారన్న కక్షతో, ఆ ఐదు కుటుంబాల ప్రాణాలు తీసేందుకు వెనుకాడబోమని బెదిరింపు లకు దిగుతున్నట్లు బాధితులు తీవ్ర భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.గిరిజన తండాల్లో పెల్లుబు కుతున్న ఆగ్రహం..గిరిజన సంస్కృతి, సాంప్రదా యాలు పరస్పర సహకారానికి, ఐక్యతకు మారు పేరు కానీ రాజకీయ విద్వేషాల వల్ల, సంకుచిత స్వార్థాల వల్ల ఒకే రక్తానికి చెందిన ఐదు కుటుంబా లను ఇలా రోడ్డున పడేయడం సమస్త లంబాడీ సమాజానికే తలవంపులు తెస్తోంది.తమ భూమిని ఊరి అవసరాలకు ఇచ్చిన వారిపైనే ఈ రాక్షసత్వ మా?అంటూ చుట్టుపక్కల తండాల గిరిజన ప్రజ లు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెలివేతలకు పాల్పడే స్వార్థపరుల ఆటలు సాగని వ్వబోమని, బాధితులకు అండగా పోరాటాలు ఉ ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.జిల్లా యం త్రాంగం ఇకనైనా నిద్రలేవాలి!దేశంలో కుల, గ్రామ బహిష్కరణలు చట్టరీత్యా తీవ్రమైన నేరం.ఈ రకమైన సాంఘిక బహిష్కరణలు ప్రాథమిక మాన వ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. తండాలో నిత్యం ప్రాణభయంతో క్షణమొక యుగంలా గడు పుతున్న ఆ 5 కుటుంబాలకు తక్షణ భద్రత కల్పిం చాలి.​జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలోజోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలి.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాంతర కోర్టులు నడుపు తున్న వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు క్రిమినల్ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ అమానుష చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.