నిరుద్యోగుల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులా? : బీఆర్ఎస్ నేతలు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన కోసం పోరాడుతున్న బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎం.డి. నవాజ్, ప్రశాంత్‌లను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా వారికి మద్దతుగా పోరాడుతున్నందుకే అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టయిన వారికి సంఘీభావం తెలిపిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మెంగాని మనోహర్, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య బద్దిపడిగే నందు, మాజీ పట్టణ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు, గూడూరి భరత్, తాళ్ల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటుకు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.


