ఉదయగిరి నియోజకవర్గంలో SIR ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BLAలు అప్రమత్తంగా పనిచేయాలని పార్టీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జూలై 24 వరకు BLOలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల నమోదు, వివరాల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇంకా నమోదు కాని పార్టీ మద్దతుదారుల ఓట్లను వెంటనే నమోదు చేయించాలని సూచించారు. ఇప్పటివరకు SIR ప్రక్రియలో సమర్థవంతంగా పనిచేసిన నాయకులు, BLAలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

SIR ప్రక్రియలో అలసత్వం వద్దు.. వైఎస్ఆర్సీపీ BLAలు అప్రమత్తంగా ఉండాలి: మేకపాటి రాజగోపాల్ రెడ్డి