రాజన్న సిరిసిల్ల జులై 17 (పున్నమి ప్రతినిధి )
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోనీ పలు గ్రామాలలో SIR-2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తన పేరు, చిరునామా, ఇతర వివరాలను ఓటరు జాబితాలో పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు ఏద్దండి నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, వార్డు సభ్యులు శీలం పద్మ వెంకటేష్, గొండయ్య, యువ నాయకుడు యాదగిరి, పల్లె సత్యం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, BLOలు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.



