*SBLT బస్సు అగ్నికి అహుతి.. తప్పిన ప్రాణాపాయం*
తిరుపతి జిల్లా
సూళ్లూరుపేట వద్ద పెను ప్రమాదం తప్పింది.
శ్రీ సిటీకి చెందిన ఎస్బీఎల్టీ బస్సు జాతీయ రహదారిపై జీరో పాయింట్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది.
గ్రామాల నుంచి కార్మికులను శ్రీ సిటీలో దించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Uploaded Video:

