Wednesday, 23 September 2026
  • Home  
  • రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి: ఎస్సై భోజ్యా నాయక్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి: ఎస్సై భోజ్యా నాయక్

సంగం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంగం ఎస్సై భోజ్యా నాయక్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి వద్ద వాహనదారులకు ఎస్సై భోజ్యా నాయక్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం, మైనర్లతో వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనదారులు నిర్ణీత వేగ పరిమితిని పాటిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్సై భోజ్యా నాయక్ పిలుపునిచ్చారు.

సంగం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంగం ఎస్సై భోజ్యా నాయక్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారి వద్ద వాహనదారులకు ఎస్సై భోజ్యా నాయక్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం, మైనర్లతో వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాహనదారులు నిర్ణీత వేగ పరిమితిని పాటిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్సై భోజ్యా నాయక్ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.