పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
కావలి: కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, ఆలయ సిబ్బంది, నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



