డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం:
ఎస్పీ ఉత్తర్వుల మేరకు కాట్రేనికోన పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లం గ్రామం జెడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండడం, పోక్సో చట్టం, రహదారి భద్రత, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, ఆస్తి నేరాల నివారణ తదితర అంశాలను వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం ఉపయోగపడే శక్తి యాప్‌ను విద్యార్థులకు పరిచయం చేసి, దాని వినియోగం మరియు ఇన్‌స్టాలేషన్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలు, భద్రతా నియమాలను పాటిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పోలీసులు సూచించారు.



